పాట రచయిత: డేవిడ్ విజయరాజు గొట్టిముక్కల, జోనా శామ్యూల్
Lyricist: David Vijayaraju Gottimukkala, Jonah Samuel
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
నీవే నా ప్రాణం సర్వం
నీవే నా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం (2)
నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..
హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే||
నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది
నీ రాకకే కదా నేనెదురు చూచునది (2)
నీవలె ఉందును నీలో వసించెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||
నా కాపరి నీవే నా ఊపిరి నీవే
నా దారివి నీవే నా మాదిరి నీవే (2)
నీవలె ఉందును నీ వెంట సాగెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||
The song is awesome Glory to God