దినదినంబు యేసుకు

పాట రచయిత: విద్యార్ధి గీతావళి
Lyricist: Vidhyaarthi Geethaavali

Telugu Lyrics


దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2)

ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2)
పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2)        ||దినదినంబు||

మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2)
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2)        ||దినదినంబు||

ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2)
ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2)        ||దినదినంబు||

దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2)
ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2)        ||దినదినంబు||

పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2)
సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2)        ||దినదినంబు||

English Lyrics

Audio

Leave a Reply

HOME