నీవే నా సంతోషగానము

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2)        ||నీవే నా||

ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్

త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2)        ||నీవే నా||

వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2)        ||నీవే నా||

నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2)        ||నీవే నా||

English Lyrics


Neeve Naa Santhosha Gaanamu
Rakshana Shrungamu Mahaa Shailamu (2)
Balashoorudaaa Yesayyaa Naa Thodai
Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu (2)       ||Neeve Naa||

O Lord! You be the Savior
Show me some mercy
Bless me with Your grace
Savior! Fill me with Your love
I will surrender
You are my king Glory to the Jesus

Thyaagamu Erugani Snehamandu
Kshemamu Karuvai Yundagaa
Nija Snehithudaa Praanamu Petti
Nee Prematho Nannaakarshinchinaavu (2)
Nirantharam Niluchunu Naapai Nee Kanikaram
Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho (2)       ||Neeve Naa||

Vedana Kaligina Deshamandu
Vekuva Velugai Nilichinaavu
Viduvaka Thodai Abhivruddhi Parachi
Aiguputhulo Simhaasanamichchinaavu (2)
Maaradu Ennadu Neevichchina Darshanam
Anudinam Anukshanam Neetho Naa Jeevitham (2)       ||Neeve Naa||

Nirjeevamaina Ee Loyayandu
Jeevaadhipathivai Velasinaavu
Heena Shareeram Mahima Shaareeramuga
Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu (2)
Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu
Hosannaa Hosannaa Neeve Maharaajuvu (2)       ||Neeve Naa||

Audio

8 comments

Leave a Reply

HOME