ఉన్నాడు దేవుడు నాకు తోడు

పాట రచయిత: బాలరాజు
Lyricist: Balaraju

Telugu Lyrics

ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు (2)
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన         ||ఉన్నాడు||

గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా (2)
కరుణ లేని లోకము కాదన్ననూ (2)
కన్నీరు తుడుచును నను కొన్నవాడు        ||ఉన్నాడు||

యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును (2)
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)
బ్రతుకు కాలమంతయు హర్షింతును          ||ఉన్నాడు||

English Lyrics

Audio

2 comments

  1. Dear brother Kranthi garu..నేను రచించిన పాటలను మీ వలె గూగుల్ లో ఉంచాలనుకుంటున్న కానీ ఎలాగో అర్ధం కావడం లేదు దయచేసి కొన్ని వివరాలు తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

    1. తప్పకుండా బ్రదర్ ప్రభు భూషణ్ గారు
      మీ ఫోన్ నెంబర్ పంపించండి. మీకు కాల్ చేస్తాను

Leave a Reply to KranthiCancel reply

HOME