కొనియాడ తరమే నిన్ను

పాట రచయిత: పంతగాని పరదేశి
Lyricist: Panthagaani Paradeshi

కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను
తనరారు దినకరు – బెను తారలను మించు (2)
ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు        ||కొనియాడ||

కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)
నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు        ||కొనియాడ||

సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)
నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు        ||కొనియాడ||

విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)
పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు        ||కొనియాడ||

దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)
యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు        ||కొనియాడ||

నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)
చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు        ||కొనియాడ||

ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)
శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత        ||కొనియాడ||

Koniyaada Tharame Ninnu
Komala Hrudaya – Koniyaada Tharame Ninnu
Thanaraaru Dinakaru – Benu Thaaralanu Minchu (2)
Ghana Thejamuna Noppu – Kaanthimanthuda Veevu         ||Koniyaada||

Kherubulu Serupulu – Mari Dootha Ganamulu (2)
Nurutharambuga Goluva – Noppu Shreshtuda Veevu         ||Koniyaada||

Sarva Lokambula – Barvu Devuda Vayyu (2)
Nurvi Sthree Garbhaana – Nudbhavinchithi Veevu         ||Koniyaada||

Vishwamanthayu Nelu – Veeraasanuda Vayyu (2)
Pashvaalitho Dotti – Pandiyuntivi Veevu         ||Koniyaada||

Dosambulanu Madiyu – Daasaali Karuninchi (2)
Yesu Peruna Jagathi – Kegudenchithi Neevu         ||Koniyaada||

Narulayanduna Karuna – Dhara Samaadhaanambu (2)
Chirakaalamunu Mahima – Paraga Jeyudu Veevu         ||Koniyaada||

O Yesu Paanpuga – Naa Yaathma Jekoni (2)
Shreyamuga Pavalinchu – Shreekara Varasutha         ||Koniyaada||

FavoriteLoadingAdd to favorites

Leave a Reply