చాచిన చేతులు నీవే

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics

చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు       ||చాచిన||

కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు        ||చాచిన||

పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని (2)
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు         ||చాచిన||

English Lyrics

Audio

Leave a Reply

HOME