ఉన్నత స్థలములలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి
నా శ్రమ దినములలో – కృపలతో కాచితివి (2)
స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా
మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా (2)

ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి
తల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి (2)
నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపిన
లేని అర్హతలను నాకు వరముగా చేసిన (2) దేవా        ||ఉన్నత||

కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండా
నీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా (2)
శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపిన
హీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన (2) దేవా         ||ఉన్నత||

గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినా
పదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా (2)
నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగా
ఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా (2) దేవా        ||ఉన్నత||

English Lyrics

Audio

Leave a Reply

HOME