సేవకులారా

పాట రచయిత: ఈనోశ్ కుమార్, డేవిడ్ పాలూరి & ఎలిజబెత్ సింథియా
Lyricist: Enosh Kumar, David Paluri & Elizabeth Cynthia

Telugu Lyrics

సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము        ||సేవకులారా||

మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
మనము గొప్పవారము కాదు
మనము మంచివారము కాదు
మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు

దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు        ||ఉన్నత||

ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
మీ శరీరము దేవుని ఆలయమిది
మీరు విలువ పెట్టి కొనబడిన వారు

సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము        ||సేవకులారా||

హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్

సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము        ||ఉన్నత||

English Lyrics

Audio

Leave a Reply

HOME