సృష్టికర్తవైన యెహోవా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ            ||సృష్టికర్తవైన||

ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)           ||సృష్టికర్తవైన||

నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2)           ||సృష్టికర్తవైన||

English Lyrics

Srushtikarthavaina Yehovaa
Nee Chethipaniyaina Naapai Endukintha Prema
Mantiki Roopamichchinaavu
Mahimalo Sthaanamichchinaavu
Naalo Ninnu Choosaavu
Neelo Nannu Daachaavu
Nisswaardhyamaina Nee Premaa
Maranamu Kante Balamainadi Nee Prema           ||Srushtikarthavaina||

Ae Kaanthi Leni Nisheedhilo
Aer Thodu Leni Vishaadapu Veedhulalo
Enno Apaayapu Anchulalo
Nannaadukunna Naa Kanna Thandrivi (2)
Yesayyaa Nanu Anaathagaa Viduvaka
Neelaanjanamulatho Naaku Punaadulu Vesithivi (2)            ||Srushtikarthavaina||

Nissaaramaina Naa Jeevithamulo
Nittoorpule Nannu Dinamella Vedhinchagaa
Nashinchipothunna Nannu Vedaki Vachchi
Nannaakarshinchina Premamoorthivi (2)
Yesayyaa Nanu Krupatho Balaparachi
Ullaasa Vasthramunu Naaku Dharimpajesithivi (2)            ||Srushtikarthavaina||

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME