పాట రచయిత: జోసఫ్ కొండా
Lyricist: Joseph Konda
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
ఒక క్షణమైనా నిన్ను వీడి
ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా||
నశియించిపోతున్న నన్ను
బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో
వేంచేసినావయ్యా యేసు (2)
నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా||
మతిలేక తిరిగిన నన్ను
నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు
వరమిచ్చినావయ్యా యేసు (2)
నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||
English Lyrics
Audio
Download Lyrics as: PPT