వాడిపోకముందే

పాట రచయిత:
Lyricist:


వాడుకో… యేసయ్యా….
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా
నీ కాడి నే మోస్తానయ్యా – (2)

వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2)
వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2)          ||వాడిపోక||

నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2)          ||వాడుకో||

నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2)          ||వాడుకో||

నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2)          ||వాడుకో||

నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే (2)          ||వాడుకో||

Vaaduko…. Yesayyaa…
Poddu Vaalipoka Munde Nannu Vaaduko Yesayyaa
Nee Kaadi Ne Mosthaanayyaa – (2)

Vaadipoka Munde Nannu Vaaduko
Poddu Vaalipoka Munde Nannu Vaaduko (2)
Vaaduko Yesayyaa – Nee Kaadi Ne Mosthaa (2)        ||Vaadipoka||

Neevichchina Yavvana Balamu Nirveeryamu Kaakamunde
Naakunna Sampadalanni Rekkalochchi Pokamunde (2)        ||Vaaduko||

Neevichchina Jeevithaaniki Velugulinka Pokamunde
Naa Brathuku Yaathraku Cheekatinka Raakamunde (2)        ||Vaaduko||

Neevichchina Praanamu Dehaanni Veedakamunde
Naa Dinamula Parimaanam Sampoornam Kaakamunde (2)        ||Vaaduko||

Neevichchina Aarogyam Aavirigaa Maaraka Munde
Naakunna Avakaasham Chejaari Poka Munde (2)        ||Vaaduko||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply