నాకున్న బలము సరిపోదయ్యా

పాట రచయిత: స్టీవెన్ రెడ్డి మురదల
Lyricist: Steven Reddy Muradala

Telugu Lyrics


నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2)
ఆత్మతో నింపి అభిషేకించు
(నీ) శక్తితో నింపి నను నడిపించు (2)        ||నాకున్న||

నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను
నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2)          ||ఆత్మతో||

మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను
మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను (2)          ||ఆత్మతో||

అనుమానంతో నేను తోమలా మారాను
అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను (2)          ||ఆత్మతో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME