దేవా నా జీవితమిదిగో

పాట రచయిత: విజయ్ ప్రసాద్ రెడ్డి
Lyricist: Vijay Prasad Reddy

Telugu Lyrics


పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం

దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం (2)
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవయాగముగా నీకు సమర్పితం (2)         ||దేవా||

నా కరములు నా పదములు నీ పనిలో
అరిగి నలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో (2)          ||నా శరీరము||

నా కాలము అనుకూలము నీ చిత్తముకై
ధనము ఘనము సమస్తము నీ పనికి
నా మరణము నీ చరణముల చెంతకై
నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2)          ||నా శరీరము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME