ప్రేమ శాశ్వత కాలముండును

పాట రచయిత: కే ప్రభుదాస్
Lyricist: K Prabhudas

Telugu Lyrics

ప్రేమ శాశ్వత కాలముండును
ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)
ప్రేమ విలువను సిలువ జూపె
ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2)
ప్రేమ చూపు నరుల యెడల
ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

ప్రేమలో దీర్ఘశాంతము
ప్రేమలో దయాళుత్వము (2)
ప్రేమ సహింప నేర్పును
ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

ప్రేమలో డంబముండదు
ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2)
ప్రేమలో తగ్గింపున్నది
ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

ప్రేమించు సహోదరుని
ప్రార్ధించు శత్రువుకై (2)
ప్రేమ యేసుని మనస్సు
ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

ప్రేమలో సత్యమున్నది
ప్రేమ సంతోషమిచ్చును (2)
ప్రేమయే సమాధానము
ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

విశ్వాసము నిరీక్షణ
ప్రేమ ఈ మూడు నిలచున్ (2)
వీటిలో శ్రేష్టమైనది
ప్రేమ యే ప్రేమ        ||ప్రేమ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

1 comment

  1. This song was written by pastor K.Prabhudas garu from pedda parimi, amaravati, Andhra Pradesh

Leave a Reply

HOME