దేవా ఇలలోన నీవు

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu


దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము
మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2)
మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2)
వందనములు అందుకో మా యేసయ్యా
కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2)       ||దేవా||

నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా
పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2)
ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా
నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా     ||వందనములు||

నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా
నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా (2)
శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా
నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా     ||వందనములు||

నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి
నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి (2)
సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి
కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి     ||వందనములు||


Devaa Ilalona Neevu Maakichchina Gruhamu
Maa Thodugaa Koluvundeti Needu Aalayamu (2)
Maa Yajamaanivi Neevai Mammulanu Nadipinchu
Nee Paniki Paatupadelaa Paathralugaa Deevinchu (2)
Vandanamulu Anduko Maa Yesayyaa
Kalakaalam Nee Kaapudale Kaavaalayyaa (2)      ||Devaa||

Nuvvu Puttina Roju Neeku Sthalamainaa Ledayyaa
Paricharya Cheyu Samayamu Ae Gruhamu Neekundayyaa (2)
Aa Oleevala Kondalalone Thaladaachina Yesayyaa
Nee Vaaralugaa Preminchi Nee Gruhamuna Nilipaavaa     ||Vandanamulu||

Nee Premanu Prathiphalinchagaa Nee Velugunu Panchumayaa
Nee Needalo Me Saaugtaku Maa Gruhamunu Kattumayaa (2)
Shodhana Vedanaledirinche Balamunu Andinchumayyaa
Nee Krupalanu Chaatincheti Saakshyamulatho Nimpumayyaa     ||Vandanamulu||

Nee Aagnalu Paatincheti Hrudayamutho Memundaali
Nirathamu Tharagni Nee Krupatho Tharatharamulu Nindaali (2)
Samaadhaana Karthavu Neevai Maa Thodugaa Neevundaali
Kalimi Lemilandu Saitham Nee Maargamulo Saagaali     ||Vandanamulu||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply