పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
ప్రేమ క్షమలను సమపాళ్లుగా
విశ్వాసమే లక్ష్యంగా
మా జీవితాలనే సాక్ష్యంగా
నిజదేవుని జనాంగంగా (2)
పిలువబడిన వారమే మేము
సిగ్గుపడని వారమే మేము (2)
మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం
మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం
మేం క్రైస్తవులం పరలోక దీపికలం
మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం
మేం క్రైస్తవులం క్రైస్తవులం
మేం క్రైస్తవులం క్రైస్తవులం
మతానికి అతీతులం
జాతి వర్ణ వర్గాలనేకం
మేం యేసు రక్తంతో కొనబడిన వారం
మేం సత్యమార్గంలో నడిచే వారం (2)
యేసు నీ జీవితమే మాకు పాఠంగా
మా బ్రతుకులకే ఒక యాగంగా
చేసుకొన్న వారమే మేము
ఏక శరీరమై ఉన్నాము (2) ||ప్రేమ||
మనుష్యులను ప్రేమిస్తాము
దైవ ప్రేమనే ప్రకటిస్తాము
ఏ శోధనకైనా తలవంచని వారం
దేవుని చెంత మోకరించే వారం (2)
లోకం మమ్ములను వేధిస్తున్నా
చులకనగా చూసి నిందిస్తున్నా
బాధను సహించే వారం
మేం శత్రువునైనా క్షమిస్తాము (2)
పాపం అంటే శరీరంతో చేసేదే కాదు
మనసులో తలంచేది అంటాం
ఎందుకంటే మేం క్రైస్తవులం
ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు
అందుకే విగ్రహారాధన మేం చెయ్యం
ఎందుకంటే మేం క్రైస్తవులం
దేవుడంటే సృష్టిని చేసిన వాడు
ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం
ఎందుకంటే మేం క్రైస్తవులం
ఎన్ని బాధలు పెట్టి హింసించినా
ప్రేమతో క్షమిస్తాము
ఎందుకంటే మేం క్రైస్తవులం ||ప్రేమ||
English Lyrics
Audio
Download Lyrics as: PPT