యేసయ్యా నాకంటూ

పాట రచయిత: డేవిడ్ సిండో
అనువదించినది: భరత్
Lyricist: David Sindo
Translator: Bharath

Telugu Lyrics


యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2)
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2)       ||యేసయ్యా||

కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME