ప్రియ యేసు మన కొరకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2)    ||ప్రియ యేసు||

కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2)    ||ప్రియ యేసు||

పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2)    ||ప్రియ యేసు||

English Lyrics

Audio

కల్వరి గిరిపై సిలువ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)

దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2)       ||కల్వరి||

మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)       ||కల్వరి||

ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2)       ||కల్వరి||

English Lyrics

Audio

సిలువలో నీ ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2)      ||సిలువలో||

తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2)     ||ఘోర పాపిని||

దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి (2)     ||ఘోర పాపిని||

అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2)     ||ఘోర పాపిని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మారా గయా సులీ పర్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మారా గయా సులీ పర్
మేరా యీషు మసీహ్ (2)
మేరా యీషు మసీహ్ (2)

మారా గయా సులీ పర్
మేరా యీషు మసీహ్ (2)
మేరా యీషు మసీహ్      ||మారా||

యీషు సులీ చడా హై
మేరే గుణా కే ఖాతిర్ (2)
ఉస్నే దీ జాన్ అప్ నీ
మేరే గుణా కే ఖాతిర్ (2)
లాఖో మే ఏక్ హై వో
మేరా యీషు మసీహ్ (2)    ||మారా||

మేరే గుణావో కా భోజ్
యీషు తూ నే లియా హై (2)
మేరే లియే సభీ దర్ద్
యీషు తూ నే సహా హై (2)
ఏక్ నామ్ అనోఖా హై వో
మేరా యీషు మసీహ్ (2)    ||మారా||

యీషు తేరే లాహూ సే
ముజ్కో మిలీ హై ముక్తి (2)
పాపోన్ సే దూర్ కే రెహ్కర్
ముజ్కో మిలీ హై శాంతి (2)
ముక్తి కా దాతా హై వో
మేరా యీషు మసీహ్ (2)    ||మారా||

English Lyrics

Audio

ముక్తి దిలాయే యీషు నామ్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ముక్తి దిలాయే యీషు నామ్
శాంతి దిలాయే యీషు నామ్ (2)

ధరణి మే తూనే జన్మ లియా యీషు (2)
సూలి పర్ హువాఁ విశ్రామ్ (2)    ||ముక్తి||

క్రూస్ పర్ అప్నా కోన్ బహాయ (2)
సారా చుకాయ దామ్ (2)    ||ముక్తి||

యీషు దయాక బెహతా సాగర్ (2)  
యీషు హై దాత మహాన్ (2)    ||ముక్తి||

హమ్ సబ్ కే పాపోంకో మిటానే (2)
యీషు హువాఁ బలిదాన్ (2)    ||ముక్తి||

హమ్ పర్ భీ యీషు క్రిపా కర్ నా (2)
హమ్ హై పాపి నాదాన్ (2)    ||ముక్తి||

English Lyrics

Audio

అదిగదిగో అల్లదిగో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో||

గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)
అచటనే యుండి ప్రార్ధించుడని (2)
పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో||

శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగింప (2)
పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో||

లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో||

చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)
మూడవసారి బొంకిన వెంటనే (2)
కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో||

యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే (2)
నీలో దోషము కనుగొనలేక (2)
చేతులు కడిగిన పిలాతుడాడుగో (2)       ||అదిగదిగో||

గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)
సాక్షాత్తు యెహోవా తనయుని (2)
సిలువను వేసిరి చూడదిగో (2)       ||అదిగదిగో||

గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
హేళన చేసిన మూకదిగో (2)       ||అదిగదిగో||

దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2)       ||అదిగదిగో||

English Lyrics

Audio

కల్వరి ప్రేమను

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం (2)

గెత్సేమనే అను తోటలో
విలపించుచు ప్రార్ధించు ధ్వని (2)
నలువైపులా వినబడుచున్నది
పగులుచున్నవి మా హృదయములు
కలుగుచున్నది దుఃఖం

సిలువపై నలుగ గొట్టిననూ
అనేక నిందలు మోపిననూ (2)
ప్రేమతో వారిని మన్నించుటకై
ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము       ||కల్వరి||

మమ్మును నీవలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివి (2)
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి కరములను
మమ్మును నడిపిపంచుము        ||కల్వరి||

English Lyrics

Audio

Chords

నా కొరకు బలియైన

పాట రచయిత: ప్రభు కుమార్
Lyricist: Prabhu Kumar

Telugu Lyrics


నా కొరకు బలియైన ప్రేమ
బహు శ్రమలు భరియించె ప్రేమ (2)
కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2)
తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2)
క్రీస్తేసు ప్రేమ         ||నా కొరకు||

నా హృదయ యోచనే జరిగించె పాపము
నా క్రియల దోషమే నడిపించె పతనముకై (2)
ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా
నా ఘోర పాపముకై మరణించినావయ్యా
ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2)
నా మంచి యేసయ్యా (2)      ||నా కొరకు||

నీ సిలువ త్యాగము నా రక్షణాధారం
నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2)
అర్హతే లేని నాకై మరణించినావయ్యా
నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా
ఘనపరతు యేసయ్యా (2)      ||నా కొరకు||

English Lyrics

Audio

యేసయ్యా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా
యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా
నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే
కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి     ||యేసయ్యా||

ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం
అయ్యో.. ఆరిపోవు దీపం
అయినా రాదు నీకు కోపం
గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి
జారే కన్నీళ్లు మాత్రం
పాపం చేసినోల్ల కోసం       ||యేసయ్యా||

నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం
నిను మోసి కట్టుకుంది పుణ్యం
ఆహా సిలువదెంత భాగ్యం
ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం
మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే
చూసిన వారి జన్మ ధన్యం      ||యేసయ్యా||

English Lyrics

Audio

నాకై చీల్చబడ్డ

పాట రచయిత: ఆగస్టస్ మాంటేగ్ టాప్ లేడీ
అనువాదకులు: హెచ్ హార్మ్స్
Lyricist: Augustus Montague Toplady
Translator: H Harms

Telugu Lyrics


నాకై చీల్చబడ్డ యో
నా యనంత నగమా
నిన్ను దాగి యందున్న
చేను మీర బారెడు
రక్త జలధారలా
శక్తి గ్రోలగా నిమ్ము

నేను నాదు శక్తిచే
నిన్ను గొల్వజాలను
కాల మెల్ల నేడ్చినన్
వేళా క్రతుల్ చేసినన్
నేను చేయు పాపము
నేనే బాప జాలను

వట్టి చేయి చాచుచున్
ముట్టి సిల్వ జేరెదన్
దిక్కు లేని పాపిని
ప్రక్క జేర్చి ప్రోవుము
నా కళంక మెల్లను
యేసునాథ, పాపుము

ఈ ధరిత్రియందున
నీరు దాటునప్పుడు
నాదరించి నీ కడన్
నాకై చీల్చబడ్డయో
నా యనంత శైలమా
నన్ను జేర దీయుమా

English Lyrics

Audio

HOME