పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
నూతన సంవత్సరం దయచేసిన దేవా
నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2)
ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2)
అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన ||
పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు
శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు
చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా
ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా
నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని
నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన||
కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా
కష్టాలతో నేను సతమతమౌతుండగా
నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా
ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి
నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని
నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని ||నూతన||