కనలేని కనులేలనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా            ||కనలేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యెహోవా మా కాపరి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా మా కాపరి
యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు (2)         ||యెహోవా||

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను         ||యెహోవా||

కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను         ||యెహోవా||

పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము         ||యెహోవా||

English Lyrics

Audio

 

 

 

HOME