స్తుతియించి కీర్తించి

పాట రచయిత: సునీల్ ప్రేమ్ కుమార్
Lyricist: Sunil Prem Kumar

Telugu Lyrics


స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా        ||స్తుతియించి||

గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా           ||స్తుతియించి||

అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు           ||స్తుతియించి||

పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా         ||స్తుతియించి||

English Lyrics

Audio

జ్యోతిర్మయుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే (2)           ||జ్యోతి||

నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా (2)           ||జ్యోతి||

నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా (2)           ||జ్యోతి||

నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2)
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద (2)           ||జ్యోతి||

English Lyrics

Audio

Chords

సాగిలపడి మ్రొక్కెదము

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2)              ||సాగిలపడి||

మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్ (2)
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము (2)             ||సాగిలపడి||

అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు (2)
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము (2)       ||సాగిలపడి||

ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్ (2)
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము (2)     ||సాగిలపడి||

యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2)
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు (2)
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్ (2)
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు (2)
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME