యేసు నీవే చాలు నాకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము
మనుషులు నను మరచినా – నా వారే విడిచినా         ||యేసు||

నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2)
ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ
ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ
కంటి పాపవలె కాయు నీవుండగా    ||యేసు||

దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2)
ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ
రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ
నిత్య జీవమొసగె నీవుండగా       ||యేసు||

English Lyrics

Audio

నా యేసు రాజ్యము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2)          ||నా యేసు||

అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2)        ||నా యేసు||

హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2)        ||నా యేసు||

English Lyrics

Audio

HOME