నువ్వెవరో యేసు

పాట రచయిత: Swapna Edwards
Lyricist: స్వప్న ఎడ్వర్డ్స్

Telugu Lyrics

ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే

నువ్వెవరో యేసు నువ్వెవరో…
నా తల్లి కన్నా నీవే
నా తండ్రి కన్నా నీవే
నా అండ దండ తోడు నీడ నీవై
నన్ను కాచితివే
ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే

నా తల్లి నను మరచే
నేనెన్నో సార్లు ఏడ్చే
నీవు నన్ను మరువక
నా ప్రక్కన ఉంటివే
నా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనే
నా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే         ||ఈ లోకం||

నా తండ్రి నను విడచే
నేనొంటరినై నడచే
నీవు నన్ను విడువక
నా చెంత నడచితివే
ఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయే
తుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే
(యేసు) నువ్వేలే నా సర్వం – (2)         ||నా తల్లి||

English Lyrics

Audio

కష్ట నష్టాలైనా

పాట రచయిత: ఎన్ అషెర్ బుషన్న
Lyricist: N Asher Bushanna

Telugu Lyrics

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)
ఓ యేసయ్యా…
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2)

నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2)         ||కష్ట||

కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2)         ||కష్ట||

కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను (2)          ||కష్ట||

English Lyrics

Audio

HOME