అందమైన క్షణము

పాట రచయిత: జాషువా అరసవెల్లి
Lyricist: Joshua Arasavelli

Telugu Lyrics

అందమైన క్షణము ఆనందమయము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)
బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)
బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు

సంబరమే సంబరము శ్రీ యేసు జననము
సర్వ జగతికి మహా సంతోషము
సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే

బలమైన యోధుడు దేవాది దేవుడు
దీన నరుడై మనకై పుట్టాడు
మన గాయములకు కట్టు కట్టి
మన బ్రతుకులను వెలుగుతో నింపిన
దైవతనయుని కొలువ రావా
సందేహించకు ఓ సోదరా
రక్షణ మార్గము కోరి రావా
సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

పాప విమోచన నిత్య జీవం
సిలువలోనే మనకు సాధ్యం
సిలువ భారం తాను మోసి
మన దోషములను తుడిచేసాడు
సిలువ చెంతకు చేర రావా
జాగు ఎందుకు ఓ సోదరా
యేసు నామము నమ్మ రావా
జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆకర్షించే ప్రియుడా

పాట రచయిత: థామస్
Lyricist: Thomas

Telugu Lyrics

ఆకర్షించే ప్రియుడా…
అందమైన దైవమా…

ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా (4)

నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది (2)
నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)
నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2)      ||ఆకర్షించే||

నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)
నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)
అదియే నేను వసియించే స్థలము (2)      ||ఆకర్షించే||

నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను (2)
దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)
అందరికి నిన్ను చాటి చెప్పెదను (2)      ||ఆకర్షించే||

English Lyrics

Audio

అందమైన మధురమైన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


అందమైన మధురమైన నామం ఎవరిది
మహిమాన్వితుడు మహిజన రక్షకుడు
ఆయనేసు యేసు యేసు (2)        ||అందమైన||

సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా
లోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)
మా పాలి దైవమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||

కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యా
ఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2)
నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||

చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావు
మానవులను ప్రేమించి చూపించావు (2)
మా కోసం మరణించి చూపించావు
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||

English Lyrics

Audio

నా యేసు రాజ్యము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2)          ||నా యేసు||

అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2)        ||నా యేసు||

హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2)        ||నా యేసు||

English Lyrics

Audio

HOME