జీవితాంతము వరకు నీకే

పాట రచయిత: పి డి శుభామణి
Lyricist: P D Shubhaamani

Telugu Lyrics

జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా   ||జీవితాంతము||

ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా   ||జీవితాంతము||

అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె
తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా   ||జీవితాంతము||

నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా   ||జీవితాంతము||

నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా   ||జీవితాంతము||

మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా   ||జీవితాంతము||

పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా   ||జీవితాంతము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

యేసూ నన్ను ప్రేమించినావు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన – నన్ను ప్రేమించినావు (2)

నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి
దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2)         ||యేసూ||

తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2)         ||యేసూ||

మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు (2)
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2)         ||యేసూ||

నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2)         ||యేసూ||

నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2)         ||యేసూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మానవుడవై సకల

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మానవుడవై సకల నరుల
మానక నా దోషముల
బాపుటకు బలియైతివే యేసు – (2)
బహు ప్రేమ తోడ         ||మానవుడవై||

నీదు బలిని నిత్యముగను
నిజముగా ధ్యానించి ప్రేమను
నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2)
నియమంబు నిచ్చి         ||మానవుడవై||

నీ శరీరము రొట్టె వలెనె
నిజముగా విరువంగబడెనే
నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2)
నా యన్న యేసు         ||మానవుడవై||

మంచి యూట మించి దండి
పంచ గాయములలో నుండి
నిత్య జీవపు టూటలు జేసితి – (2)
నీ ప్రేమ నుండి         ||మానవుడవై||

నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు
నీదు ప్రేమ బలిలో మనుటకు
నిత్య మాచరించుడంటివి నీ – (2)
నిజ భక్తి తోడ         ||మానవుడవై||

ఎంతో ప్రేమతో బలిగానయితివి
యెంతో ప్రేమాచారమైతివి
చింతలును నా పాపములు బాప – (2)
శ్రీ యేసు దేవా         ||మానవుడవై||

నిత్య బలియగు నిన్నే నమ్మి
నిన్ను ననుభవించి నెమ్మి
నిన్ను నిముడించుకొని నాలో నీ – (2)
నిజ రూప మొంద         ||మానవుడవై||

నేను నీ బలిలోన గలిసి
నేను నీతో గలిసి మెలిసి
నేను నీవలె నుండి జేసితివే – (2)
నా దివ్య యేసు         ||మానవుడవై||

నీదు శ్రమలను బలిని నిపుడు
నాదు కనులు చూడ నెపుడు
నాదు పాప భారములు దిగునే – (2)
నా దివ్య యేసు         ||మానవుడవై||

నీవు బలియై తిరిగి లేచి
నిత్య తేజోరూపు దాల్చి
నిత్యమును నా బంతి నున్నావే – (2)
నిజ దేవా యేసు         ||మానవుడవై||

నీవే నీ చేతులలో నిత్తువు
ఈ నీ బలి విందునకు వత్తువు
నిన్ను నిట జూచితిని నా యేసు – (2)
ఎన్నడును మరువను         ||మానవుడవై||

English Lyrics

Audio

మనస యేసు మరణ బాధ

పాట రచయిత: మిక్కిలి సమూయేలు
Lyricist: Mikkili Samooyelu

Telugu Lyrics


మనస యేసు మరణ బాధ – లెనసి పడవే
తన – నెనరు జూడవే యా – ఘనుని గూడవే
నిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే          ||మనస||

అచ్చి పాపములను బాప – వచ్చినాడట
వా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందున
తా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట          ||మనస||

ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచు
న-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్
ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా          ||మనస||

పట్టి దొంగవలెను గంత – గట్టి కన్నులన్
మరి – గొట్టి చెంపలన్ వడి – దిట్టి నవ్వుచున్
నిను – గొట్టి రెవ్వరదియు మాకు – జెప్పమనిరట          ||మనస||

ముళ్ల తోడ నొక కిరీట – మల్లి ప్రభు తలన్
బెట్టి – రెల్లు కర్రతో నా – కళ్ళ జనములు
రా-జిల్లు మనుచు గొట్టి నవ్వి – గొల్లు బెట్టిరా          ||మనస||

మొయ్యలేక సిల్వ భారము – మూర్చ బోయెనా
అ-య్యయ్యో జొక్కెనా యే-సయ్య తూలెనా
మా – యయ్యనిన్ దలంపగుండె – లదరి పోయెనా          ||మనస||

కాలు సేతులన్ గుదించి – కల్వరి గిరిపై
నిన్ – గేలి జేయుచు నీ – కాళ్ళ మీదను
నినుప – చీలలతో గృచ్చి నిన్ను – సిల్వ గొట్టిరా          ||మనస||

దేవ సుతుడా వైతి వేని – తీవరంబుగా
దిగి – నీవు వేగమే రమ్ము – గావు మనుచును
ఇట్లు – గావరించి పల్కు పగర – కరుణ జూపెనా          ||మనస||

తన్ను జంపు శత్రువులకు – దయను జూపెనా
తన – నెనరు జూపెనా ప్రభు – కనికరించెనా
ఓ – జనక యీ జనుల క్షమించు – మనుచు వేడెనా          ||మనస||

తాళలేని బాధ లీచ్చి – దాహమాయెనా
న-న్నేలువానికి నా – పాలి స్వామికి
నే-నేల పాపములను జేసి – హింస పరచితి          ||మనస||

గోడు బుచ్చి సిలువపైన – నేడు మారులు
మా-ట్లాడి ప్రేమతో నా – నాడు శిరమును
వంచి – నేడు ముగిసె సర్వ మనుచు – వీడె ప్రాణము          ||మనస||

మరణమైన ప్రభుని జూచి – ధరణి వణకెనా
బల్ – గిరులు బగిలెనా – గుడి తెరయు జీలెనా
దివా-కరుడు చీకటాయె మృతులు – తిరిగి లేచిరి          ||మనస||

ఇంత జాలి యింత ప్రేమ – యింత శాంతమా
నీ – యంత కరుణను నే – జింత చేయగా
నీ – వింత లెల్ల నిత్య జీవ – విధము లాయెనా          ||మనస||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME