ఆకాశం నీ సింహాసనం

పాట రచయిత: జోయెల్ జశ్వంత్ గుమ్మడి
Lyricist: Joel Jaswanth Gummadi

Telugu Lyrics


ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)
మార్గము నీవే – జీవము నీవే       ||ఆకాశం||

పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా (2)
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా       ||ఆకాశం||

నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా (2)
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా       ||ఆకాశం||

భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా       ||ఆకాశం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ కృప చాలును

పాట రచయిత: ఎన్ రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: N Raj Prakash Paul

Telugu Lyrics

నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)
నీవు లేని జీవితం అంధకార బంధురం (2)
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2)
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2)
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)

English Lyrics

Audio

అందాలు చిందే

పాట రచయిత: రమేష్
Lyricist: Ramesh

Telugu Lyrics

అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2)       ||అందాలు||

చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా (2)
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం (2)       ||అందాలు||

సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం (2)
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం (2)       ||అందాలు||

యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత (2)
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో (2)       ||అందాలు||

English Lyrics

Audio

ఆరాధన అందుకో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఆరాధన అందుకో (2)
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నానని (2)
అల్ఫయు నీవే ఓమెగయును (2)
ఆద్యంత రహితుండ నీవేనని
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

పాపంబున జన్మించి నశియించితిని
లోకంబు నాదనుచు ఆశించితిని (2)
అయినా నీవు రక్షణ నివ్వ (2)
వెలిగించి పంపితివి యేసు ప్రభును
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

తెలిసికొంటిని నా యేసు నిన్ను
సర్వ శక్తి గల ప్రభువనియు (2)
రానున్నావు మరలా నాకై (2)
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో          ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME