పాపిగ నను చూడలేక

పాట రచయిత: జాన్ విట్నీ, సమతా రెబెకా
Lyricist: John Vittney, Samatha Rebecca

Telugu Lyrics

పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా
దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా (2)
నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే
అర్హత నాకిచ్చుటకు – అవమాన-మొందితివే
తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే
జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే

నీవే నీవే – నీవే దేవా
నీవే నీవే – నా యేసయ్యా (2)

పరమును వీడి ఈ భువికి
దిగి వచ్చిన రక్షకుడా
మహిమను వీడి నా వెలని
చెల్లించిన ప్రేమామయుడా

నే వెదకి రాలేనని సత్యమునెరిగి
నీవే నా దరికి పరుగెత్తితివి
దాసత్వము నుండి నను విడిపించి
తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి          ||నీవే||

నా స్థానములో నీవే నిలిచి
నీ స్థానమే నాకిచ్చితివి
సౌందర్యవంతునిగా నన్నే చేసి
సొగసంతా కోల్పోయితివి

నీ బలమంతా నాకే ఇచ్చి
బలియాగముగా నీవు మారితివి
ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి
దీనతనే హత్తుకొంటివి          ||నీవే||

నా బలమంతా నీవే – నా సౌందర్యము నీవే
నా ఐశ్వర్యము నీవే – నీవే నీవే
నా అతిశయము నీవే – నా ఆనందం నీవే
నా ఆధారం నీవే – నీవే నీవే (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)     ||పాపిగ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నన్ను పిలచిన దేవా

పాట రచయిత: బెన్ని జాషువా
Lyricist: Benny Joshua

Telugu Lyrics


నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా (2)
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చించునది నీ కృప మాత్రమే (2)
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా …

ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2)
బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2)
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను       ||నీ కృపయే||

నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2)
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2)
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను        ||నీ కృపయే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎందుకో దేవా ఇంతటి ప్రేమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
ఎన్నిక లేని నరుని మీద (2)
మమతకు ప్రేమకు అర్హత లేని (2)
మంటిపై ఎందుకు ఇంత ప్రేమ     ||ఎందుకో||

ఎందుకు పనికిరాని నన్ను
ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)
ఎంచితివి నీ పుత్రికగా నన్
పెంచితివి నీ కృపతో నన్ను        ||ఎందుకో||

సర్వ పాపముల పరిహారి
సర్వ జనులకు ఉపకారి (2)
శాపము నొందిన దోషి మీద
శాశ్వత ప్రేమను చూపితివా         ||ఎందుకో||

నాశ మార్గములో బ్రతికిన నన్ను
నీతి మార్గముకు పిలిచితివా (2)
నిత్యము నీతో యుండుటకు
పాపిని నన్ను పిలచితివా         ||ఎందుకో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME