అలంకరించును

పాట రచయిత: జాన్ జెబరాజ్
Lyricist: John Jebaraj

Telugu Lyrics

నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచిపోవునా (2)
ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)

నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2)
తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2)     ||స్తుతింపజేయునే||

సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే
బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో – అలంకరించునే…

విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు
ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2)
కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2)     ||స్తుతింపజేయునే||    ||నా మనస్సా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆధారం నాకు ఆధారం

పాట రచయిత: బొనిగల బాబురావు
Lyricist: Bonigala Babu Rao

Telugu Lyrics

ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా      ||ఆధారం||

భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా (2)
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2)         ||ఆధారం||

దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2)         ||ఆధారం||

దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2)
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2)         ||ఆధారం||

English Lyrics

Audio

HOME