బంతియనగ ఆడరే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

బంతియనగ ఆడరే
మన బాల చిన్న ముద్దుల యేసుకు (2)
ముచ్చిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స (2)
ప ద ని స.. ప ద ని స
ప ద ప ద గ మ
గ మ గ రి స రి        ||బంతి||

దూతలెల్ల కూడిరి
మంచి గీతములను పాడిరి (2)        ||ముచ్చిక||

గొల్లలెల్ల చేరిరి
మంచి గొర్రెలనర్పించిరి (2)        ||ముచ్చిక||

జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి (2)        ||ముచ్చిక||

క్రీస్తు యొక్క జన్మ దిన
మహోత్సవముగా జరిగెను (2)        ||ముచ్చిక||

English Lyrics

Audio

దిక్కులెన్ని తిరిగినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి         ||దిక్కులెన్ని||

దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో             ||దిక్కులెన్ని||

English Lyrics

Audio

బాల యేసుని జన్మ దినం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


బాల యేసుని జన్మ దినం
వేడుకైన శుభ దినము
సేవింప రారే జనులారా
ముద్దుల బాలకు ముద్దులిడ         ||బాల||

మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని
చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2)
చేకొని లాలింప రారే
జో జోల పాటలు పాడి          ||బాల||

పాపికి పరమ మార్గము జూప
ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2)
పశుశాలయందు పవళించే
తమ ప్రేమను జూపింప మనకు        ||బాల||

మన జోల పాటలు ఆలించు బాలుడు
దేవాది దేవుని తనయుడు గనుక (2)
వరముల నొసగి మనకు
దేవుని ప్రియులుగా జేయు           ||బాల||

English Lyrics

Audio

HOME