దేవా పరలోక దుతాలి

పాట రచయిత: అంశుమతి మేరీ
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics


దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ (2)
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా – (4)          ||దేవా||

కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా (2)        ||మహిమా||

నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా (2)        ||మహిమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు రక్షకా

Telugu Lyrics


యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను

శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2)        ||యేసు రక్షకా||

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2)        ||యేసు రక్షకా||

యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3)        ||యేసు ఆరాధించెదను||

English Lyrics

Audio

శృతిచేసి నే పాడనా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2)      ||శృతిచేసి||

దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME