భక్తులారా స్మరియించెదము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

భక్తులారా స్మరియించెదము
ప్రభు చేసిన మేలులన్నిటిని (2)
అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)
సర్వము చక్కగ చేసె (2)         ||భక్తులారా||

గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే (2)
శ్రమలలో మనకు తోడైయుండి
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్ (2)         ||భక్తులారా||

ఈ భువియందు జీవించు కాలం
బ్రతికెదము ప్రభు కొరకే (2)
మనమాయనకర్పించుకొనెదము
మనమాయనకర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే (2)         ||భక్తులారా||

కొంచెము కాలమే మిగిలియున్నది
ప్రభువును సంధించుటకై (2)
గనుక మనము నడచుకొనెదము
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు (2)         ||భక్తులారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

జాగ్రత్త భక్తులారా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును
వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును
వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము

చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా
విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త||

గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము
లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త||

మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి
ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త||

దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురు
మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు ||జాగ్రత్త||

క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు
ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు ||జాగ్రత్త||

English Lyrics

Audio

HOME