వాగ్ధానములన్ని

పాట రచయిత: వినోద్ కుమార్
Lyricist: Vinod Kumar

Telugu Lyrics


వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు (4)
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానముల్ నా సొంతమేగా (4)

కన్నీటిని తుడచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2)
ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2)
నా నీతివలన కానీ కాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా (2)      ||నేను జడియను||

కృంగిపోక నే సాగిపోదును
నీ కృప నా తోడున్నదిగా (2)
అది ఇరుకైననూ విశాలమైననూ (2)
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా (2)

నే అలయక సాగెదనయ్యా…
అది ఇరుకైననూ విశాలమైననూ (2)
నా యేసయ్య తోడుండగా
నే అలయక సాగెదనుగా (2)      ||నేను జడియను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆకాశమందు నీవుండగా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను (2)

శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా (2)
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను (2)        ||ఆకాశమందు||

వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు (2)
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను (2)        ||ఆకాశమందు||

పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు (2)
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు (2)        ||ఆకాశమందు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME