పిల్లలారా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

పిల్లలారా నా మాట వినుడి
యెహోవా యందు భక్తి నేర్పెదను – (2)       ||పిల్లలారా||

బ్రతుక గోరువాడెవడైన కలడా? (2)
మేలునొందుచు చాలా దినములు (2)       ||పిల్లలారా||

కపటమైన చెడు మాటలాడక (2)
కాచుకొనుము నీదు పెదవులను (2)       ||పిల్లలారా||

కీడు మాని మేలునే చేయుము (2)
సమాధానము వెదకి వెంటాడు (2)       ||పిల్లలారా||

యెహోవా దృష్టి నీతిమంతులపై (2)
కలదు వారి మొఱల వినును (2)       ||పిల్లలారా||

దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2)
కొట్టివేయు తన సన్నిధి నుండి (2)       ||పిల్లలారా||

నీతిమంతులు మొఱ పెట్టగా (2)
విని శ్రమల నుండి తప్పించును (2)       ||పిల్లలారా||

విరిగినట్టి హృదయములకు (2)
యెహోవా ఆసన్నుడై యున్నాడు (2)       ||పిల్లలారా||

నలిగియున్న వారల నెల్ల (2)
ఆయనే రక్షించు ప్రేమగల్గి (2)       ||పిల్లలారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు నిన్ను నేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నిన్ను నేను చూడలేను
చూడకుండా బ్రతుకలేను
ప్రభువా నీతో నేను నడువలేను
నిన్ను విడచి సాగలేను
యేసు రాజా రాజుల రాజా
నా కనులు తెరిచి కనిపించయా (2)

ఎత్తైన కొండపై నీవు పొందిన
రూపాంతర అనుభవము
నన్ను పొందనిమ్ము (2)
పేతురు యాకోబు యోహానులు
చూచినట్లు నను చూడనిమ్ము (2)     ||యేసు నిన్ను||

తిన్నని వీధిలో పౌలు భక్తునికి
దర్శనమిచ్చిన దేవా
నాకు నువ్వు కనబడుము (2)
ఆది అపోస్తలుల ఆత్మానుభవము
పొందినట్లు నను పొందనిమ్ము (2)     ||యేసు నిన్ను||

English Lyrics

Audio

 

 

HOME