రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా

పాట రచయిత: జాన్ జె
Lyricist: John J

Telugu Lyrics


రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2)
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2)
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2)     ||రాజా||

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2)   ||నేనుండలేనయ్యా||

ఒంటరి పోరు నన్ను విసిగించినా
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2)   ||నేనుండలేనయ్యా||

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2)   ||నేనుండలేనయ్యా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

నీవు లేనిదే నేను లేను

పాట రచయిత: జి ఎస్తేర్ రాణి
Lyricist: G Esther Rani

Telugu Lyrics

నీవు లేనిదే నేను లేను ప్రభువా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2)
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2)
మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2)
నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2)          ||నీవు||

గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ
తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2)
నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2)
ఆ సిలువే నాకు శరణం
నా పాప పరిహారం (2)          ||నీవు||

అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ
జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ (2)
నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే (2)
ఆ సిలువే నాకు నిరతం
నా జీవిత చిరుదీపం (2)          ||నీవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME