పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2)
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా ||గలిలయ||
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించిన (2)
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ||
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2)
ఆగకుండా ముందుకే కొనసాగిన
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా ||గలిలయ||
English Lyrics
Audio
Download Lyrics as: PPT