గలిలయ తీరాన

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2)
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా          ||గలిలయ||

యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించిన (2)
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ||

సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2)
ఆగకుండా ముందుకే కొనసాగిన
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా          ||గలిలయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చాలునయ్యా చాలునయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చాలునయ్యా చాలునయ్యా
నీ కృప నాకు చాలునయ్యా (2)
ప్రేమామయుడివై ప్రేమించావు
కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)          ||చాలునయ్యా||

జిగటగల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)      ||చాలునయ్యా||

బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)        ||చాలునయ్యా||

English Lyrics

Audio

HOME