స్తోత్రము స్తుతి చెల్లింతుము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం (2)           ||స్తోత్రము||

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా (2)
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా (2)       ||నీవే||

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి (2)       ||నీవే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తోత్రం చెల్లింతుము

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి          ||స్తోత్రం||

దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)       ||స్తోత్రం||

గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)      ||స్తోత్రం||

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)      ||స్తోత్రం||

సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)     ||స్తోత్రం||

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)       ||స్తోత్రం||

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)      ||స్తోత్రం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME