లోకములో వెఱ్ఱివారిని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా యేసయ్యా
విద్య లేని పామరులను పేరు పెట్టి పిలిచావయ్యా

జాలర్లను పిలిచావయ్యా యేసయ్యా
మనుష్యులు పట్టేవారుగా మార్చావయ్యా (2)
నన్ను అట్టి రీతిగా మార్చుమయా

జక్కయ్యను పిలిచావయ్యా యేసయ్యా
నేడు నీతో ఉంటానన్నావయ్యా (2)
నాతో అట్టి రీతిగా ఉండుమయా

సౌలును పిలిచావయ్యా యేసయ్యా
పౌలుగ మార్చావయ్యా (2)
నన్ను అట్టి రీతిగా మార్చుమయా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

పాట రచయిత: శుభాకర్ రావు
Lyricist: Shubhakar Rao

Telugu Lyrics

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2)      ||ఎన్నో||

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           ||ఎన్నో||

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)      ||ఎన్నో||

English Lyrics

Audio

HOME