సిలువలో నీ ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2)      ||సిలువలో||

తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2)     ||ఘోర పాపిని||

దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి (2)     ||ఘోర పాపిని||

అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2)     ||ఘోర పాపిని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీతి న్యాయములు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజ్య దండముతో         ||నీతి||

ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2)      ||నీతి||

పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)
ప్రగతి పథములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2)      ||నీతి||

నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)
మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2)      ||నీతి||

English Lyrics

Audio

HOME