నా చిన్ని హృదయంలో

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

Telugu Lyrics


నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)
తన ప్రేమనే మాకు చూపి
తన వారసులుగా మము చేసెను
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు (4)

లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును (2)
తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును         ||నాలో||

హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడూ నాకు తోడుండును (2)
అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము         ||నాలో||

English Lyrics

Audio

చిన్ని చిన్ని చేతులతో

పాట రచయిత: జాషువా అరసవెల్లి
Lyricist: Joshua Arasavelli

Telugu Lyrics

చిన్ని చిన్ని చేతులతో
బుల్లి బుల్లి బుగ్గలతో
బెత్లెహేము పురము నుండి
కన్య మరియకి పుట్టెనండి
యేసు క్రీస్తు నామమండి
రక్షకుడని అర్ధమండి

పరలోకమున దూతలందరు
సర్వ సైన్యములతో కూడను
పాటలతో పరవశిస్తూ
మహిమ కరుడంటూ పొగుడుతూ
భువికేగె నేకముగా బూరధ్వనితో
రక్షకుని సువార్త చాటింపగా

ఆకసమున తారలన్ని
నేముందు నేముందని త్వర త్వరపడగా
తూర్పు నందొక చిన్ని తార
పరు పరుగున గెంతుకొచ్చి
భువికి సూచన ఇవ్వనండి
బెత్లెముకి మార్గము చూపనండి

దూత వార్త గొన్న గొల్లలు
గెంతులేస్తూ చూడ వచ్చిరి
పసుల తొట్టిలో ప్రభుని చూచి
పట్టలేని సంతసముతో
స్తుతుల గానము చేసెరండి
సకల జనులకు చాటెరండి

తారన్ చూచి జ్ఞానులు కొందరు
రారాజును చూడ బయలు దేరి
బంగారమును బోళమును
సాంబ్రాణి కూడా పట్టుకొచ్చె
పూజించ వచ్చిరి ప్రభు యేసుని
రాజులకు రాజని ఎరిగి వారు

ఎంత సందడి ఎంత సందడి
దీవిలోన భువిలోన ఎంత సందడి
యేసు రాజు జన్మ దినము
ఎంత భాగ్యము ఎంతో శుభము
దేవ దేవుని అమర ప్రేమండి
దివ్య వాక్కు ఫలితమండి

English Lyrics

Audio

నా చిన్ని దోనెలో

పాట రచయిత: పి వి వి సురేష్ కుమార్
Lyricist: P V V Suresh Kumar

Telugu Lyrics


హైలెస్సా హైలో హైలెస్సా (2)
నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు
భయమేమి లేదు నాకు ఎప్పుడు (2)       ||హైలెస్సా||

పెను గాలులే ఎదురొచ్చినా
తుఫానులే నన్ను ముంచినా (2)
జడియక బెదరక నేను సాగెద
అలయక సొలయక గమ్యం చేరెద (2)       ||హైలెస్సా||

English Lyrics

Audio

చిన్ని మనసుతో నిన్ను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2)
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2)
నీవే నా ధ్యానము (2)         ||చిన్ని||

తండ్రి మాటను ధిక్కరించక
తలవంచిన ఇస్సాకు వలే (2)
విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2)
వినయముగల మనసివ్వుము (2)         ||చిన్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

నా చిన్ని హృదయము

పాట రచయిత: లోయిస్ యార్లగడ్డ
Lyricist: Lois Yarlagadda

Telugu Lyrics


నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
నిను చాటనీ – నిను ఘనపరచనీ
నీ రాకకై వేచియుండనీ         ||నా చిన్ని||

కావలివారూ వేకువకై చూచునట్లు
నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2)
నా ప్రాణము నీకై యెదురు చూడనీ         ||నా చిన్ని||

దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2)
నా ప్రాణము నిన్నే ఆశింపనీ         ||నా చిన్ని||

పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2)
నా కన్నులు నీపైనే నిలచియుండనీ         ||నా చిన్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా చిన్ని హృదయమందు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)

పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||

బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||

English Lyrics

Audio

HOME