బలపరచుము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

బలపరచుము స్థిరపరచుము
నా ప్రార్థనకు బదులీయము (2)
లోకాశల వైపు చూడకూండా
లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకు       ||బలపరచుము||

నా మాటలలో నా పాటలలో
నీ సువార్తను ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ
నే నిలుచు చోటు లోతైననూ (2)
నే జడవక నిను కొలుతును       ||బలపరచుము||

ధ్యానింతును కీర్తింతును
నీ వాక్యమును అను నిత్యము (2)
అపవాది నన్ను శోధించినా
శ్రమలన్ని నాపై సంధించినా (2)
నే జడవక నిను కొలుతును     ||బలపరచుము||

English Lyrics

Audio

యేసు నిన్ను నేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నిన్ను నేను చూడలేను
చూడకుండా బ్రతుకలేను
ప్రభువా నీతో నేను నడువలేను
నిన్ను విడచి సాగలేను
యేసు రాజా రాజుల రాజా
నా కనులు తెరిచి కనిపించయా (2)

ఎత్తైన కొండపై నీవు పొందిన
రూపాంతర అనుభవము
నన్ను పొందనిమ్ము (2)
పేతురు యాకోబు యోహానులు
చూచినట్లు నను చూడనిమ్ము (2)     ||యేసు నిన్ను||

తిన్నని వీధిలో పౌలు భక్తునికి
దర్శనమిచ్చిన దేవా
నాకు నువ్వు కనబడుము (2)
ఆది అపోస్తలుల ఆత్మానుభవము
పొందినట్లు నను పొందనిమ్ము (2)     ||యేసు నిన్ను||

English Lyrics

Audio

 

 

HOME