హల్లే హల్లే హల్లే హల్లేలూయా

పాట రచయిత: హనోక్ బోనాల
Lyricist: Hanok Bonala

Telugu Lyrics

హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేల నాకు (2)
నిను ప్రకటింపని పెదవులేల
నిను స్మరియించని బ్రతుకు ఏల (2)      ||హల్లే||

నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా (2)
నాకు మరణము విధియింపగా
నాపై జాలిని చూపితివే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని మొరపెట్టగా
నీ దయ చేత దృష్టించినావే (2)      ||నిను||

నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు (2)
నాకు జీవం మార్గం నీవైతివయ్యా
నిత్య నరకాన్ని తప్పించినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు (2)      ||నిను||

English Lyrics

Audio

నీతో నుండని బ్రతుకు

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
ఊహించలేను నా యేసయ్యా
నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా (2)

నీదు స్వరము వినకనే నేను
నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2)          ||నిను||

నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ
నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా        ||నీతో||

నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2)
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా          ||నిను||

English Lyrics

Audio

యేసు రాజ నాలో నిన్ను

పాట రచయిత: రాజబాబు
Lyricist: Rajababu

Telugu Lyrics


యేసు రాజ నాలో నిన్ను చూడనీ
త్వరలో నీలో నన్ను సాగనీ (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా – (2)          ||యేసు రాజ||

తరిమే తరతరాల ఒరవడిలో
ఉరికే పరిసరాల సవ్వడిలో (2)
నీ తోడే చాలని – నీ నీడే మేలని
నా కోట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు వాకిటలో (2)
నీ మాట చాలని – నీ బాట మేలని
నా పాట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

English Lyrics

Audio

HOME