యేసయ్యా నాకంటూ

పాట రచయిత: డేవిడ్ సిండో
అనువదించినది: భరత్
Lyricist: David Sindo
Translator: Bharath

Telugu Lyrics


యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2)
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2)       ||యేసయ్యా||

కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రిస్మస్ వచ్చిందయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు (2)
ఆనందం వెల్లి విరిసే
జగతిలో జ్యోతిగా నేడు (2)
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా        ||క్రిస్మస్||

లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప (2)
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు (2)       ||క్రీస్తుకు||

యేసుకు మనలో చోటిస్తే
మానమొక తారగ కనిపిస్తాం (2)
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం (2)       ||క్రీస్తుకు||

English Lyrics

Audio

కన్నులనెత్తి పైరుల చూడు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)

కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)
ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||

మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||

విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||

మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)
సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||

మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

తోడు లేరని కుమిలిపోకు

పాట రచయిత: బాబన్న
Lyricist: Babanna

Telugu Lyrics


తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2) |      |ఓహో సోదరా||

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)         ||ఓహో సోదరా||

English Lyrics

Audio

HOME