నీ పాదాలే నాకు శరణం

పాట రచయిత: మాథ్యూస్
Lyricist: Matthews

Telugu Lyrics


నీ పాదాలే నాకు శరణం
యేసయ్యా నీవే ఆధారము (2)
నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2)
నా దాగు చాటు నీవే యేసయ్యా (2)       ||నీ పాదాలే||

అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2)
నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
కనిపించదు వేరొక ఆశ్రయము (2)
కనిపించదు వేరొక ఆశ్రయము
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2)
నా పోషకుడా నీ కన్న నాకు
కనిపించరే వేరొక పోషకుడు (2)
కనిపించరే వేరొక పోషకుడు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2)
నా జయశీలుడా నీకన్న నాకు
కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2)
కనిపించరే జయమునిచ్చే వేరొకరు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

English Lyrics

Audio

యేసయ్యా నా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా యేసయ్యా
నాపై నీకెందుకింత ప్రేమయ్యా (2)
నా పాపములను క్షమియించినావయ్యా
నా దోషమును భరియించినావయ్యా
నీ ప్రేమకు కొలతే లేదయ్యా
నా దాగు చోటు నీవయ్యా (2)        ||యేసయ్యా||

ఆజ్ఞను వినని అవిధేయత
నీ సన్నిధి నుండి తొలగించనీ (2)
ఉపద్రవములు నన్ను చుట్టుకొనగా
ఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా (2)        ||యేసయ్యా||

లోకపు ఆశతో నిండియుండగా
జీవపు ఢంబము మదిని చేరగా (2)
చెడిపోయి నేను తిరిగి రాగా
నా రాకకై దారిలో వేచియుంటివి (2)        ||యేసయ్యా||

English Lyrics

Audio

HOME