దేవా నీ సన్నిధిలో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

దేవా నీ సన్నిధిలో నిలచి
దీనులమై మొరపెట్టుచున్నాము – (2)     ||దేవా||

అపరాధులగు నీదు ప్రజల
నెపములన్నియు బాపి (2)
కృపాళుండగు యేసు ప్రభువా
కృపను జూపి రక్షించుమయా (2)     ||దేవా||

చేసి యున్నాము నేరములెన్నో
చేసిన మేలులను మరచి (2)
మోసములలో బడియున్నాము
యేసుప్రభు జయమునిమ్ము (2)     ||దేవా||

లోకపు మర్యాదలకు లొంగి
లోకుల మాటలను వినియు (2)
నీ కట్టడలను మరచితిమి
కట్టుము మమ్ము నీ వాక్యముచే (2)     ||దేవా||

నిస్వార్థులగు నీ దాసులను
విశ్వాస ప్రమాణికులన్ (2)
శాశ్వతమైన ప్రేమతో నింపు
విశ్వాసులు స్థిరపడి నడువ (2)     ||దేవా||

సహవాసములో మమ్ము నిలిపి
సహనము మాకు నేర్పించి (2)
మహిమా పూర్ణుడ యేసు నిన్ను
ఈ మహిలో చాటించుటకు (2)     ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME