మూడు దశాబ్దాల

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని
దీవించిన దేవా నీకు వందనం (2)
వందనం వందనం…
వందనం నీకే మా వందనం (2) దేవా        ||మూడు దశాబ్దాల||

పాపులమైన మమ్మును
వెదకి రక్షించినందుకు
ఏమియు లేని మాకు
అన్నిటిని నొసగినందుకు (2)        ||వందనం||

బలవంతులుగా చేసి
మూడు బాణాలను ఇచ్చినందుకు
మా భోజనపు బల్ల చుట్టు
ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2)       ||వందనం||

మా కష్టాలలో, దుఃఖాలలో
మమ్ము కాచిన దేవా
మా వ్యాధులను, బాధలను
తీర్చిన దేవా (2)         ||వందనం||

English Lyrics

Audio

నన్నెంతగానో ప్రేమించిన

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)
నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)
నా యవ్వనమంతా… నా జీవితమంతా (2)     ||నన్నెంతగానో||

ధరలోని మన్నుతో సమమైన నన్ను
ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)
అన్నీ నీవే నాకై సమకూర్చినావు
ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)
వాక్యపు మన్నాతో పోషించిన నన్నే
ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే    ||నిన్నే||

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు
ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)
మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు
చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2)
పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో
మరణపు విల్లును విరచిన దేవా నీలో      ||నీలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME