నీతి సూర్యుడవై

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2)
నీదు రక్షణతో మమ్ము కాచినందుకు
నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2)
నీకే వందనం – నీకే వందనం
నీకే వందనం – యేసు రాజ వందనం (2)     ||నీతి||

త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా
నీదు విందులోన చేరాలని మా దేవా (2)
సిద్ధపాటుకై కృపలను చూపుమని
నిన్నే వేడితిమి నీవే మా బలమని (2)    ||నీకే||

నీ నామము రుచిని ఎరిగిన వారము మేము
నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2)
నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు
నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2)    ||నీకే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఓ మానవా నీ పాపం మానవా

పాట రచయిత: సునీల్ ప్రేమ్ కుమార్
Lyricist: Sunil Prem Kumar

Telugu Lyrics


ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2)         ||ఓ మానవా||

ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2)         ||ఓ మానవా||

ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2)         ||ఓ మానవా||

English Lyrics

Audio

సర్వాంగ కవచము నీవే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వాంగ కవచము నీవే
ప్రాణాత్మ దేహము నీవే
నా అంతరంగము నీవే దేవా (2)
నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి
నా పాపమును తీసీ
నా భారమును మోసావయ్యా… యేసయ్యా
నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ..
నా ప్రాణము నీవే నా యేసయ్యా (2)

వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై
సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా
నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై
సమాధాన సువార్త నీవై నా యేసయ్యా          ||నా సర్వము||

దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై
బూడిదెనకు ప్రతిగా పూదండవై
దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై
భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై        ||నా సర్వము||

English Lyrics

Audio

మార్గము నీవని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మార్గము నీవని – గమ్యము నీవని – (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సుగమమాయెనే జీవ యాత్ర
ప్రాణము నీవని – దేహము నీదని – (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
చైతన్యమొందెనే జీవ యాత్ర

బాధల బరువులో – నిత్య నిరాశలో
శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2)
శాంతము నీవని – స్వస్థత నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
ఆనందమాయెనే జీవ యాత్ర         ||మార్గము||

ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా
గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా (2)
ధాత్రము నీవని – స్తోత్రము నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సంగీతమాయెనే జీవ యాత్ర        ||మార్గము||

English Lyrics

Audio

సమర్పణ చేయుము ప్రభువునకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)

అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా       ||సమర్పణ||

ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా      ||సమర్పణ||

నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా      ||సమర్పణ||

English Lyrics

Audio

 

 

HOME