విలువైనది నీ ఆయుష్కాలం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)            ||విలువైనది||

బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2)            ||విలువైనది||

మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2)            ||విలువైనది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ జీవితం విలువైనది

పాట రచయిత: సత్యవేద సాగర్
Lyricist: Satyaveda Sagar

Telugu Lyrics

ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు           ||ఈ జీవితం||

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||

English Lyrics

Audio

సహోదరులారా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సహోదరులారా ప్రతి మనుష్యుడు
ఏ స్థితిలో పిలువబడెనో
ఆ స్థితియందే దేవునితో సహవాసము
కలిగియుండుట మేలు (2)

సున్నతి లేకుండ పిలువబడితివా
సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)
సున్నతి పొంది నీవు పిలువబడితివా
సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే
మనకెంతో ముఖ్యమైనది (2)        ||సహోదరులారా||

దాసుడవైయుండి పిలువబడితివా
స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)
స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా
క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)
విలువ పెట్టి మనము కొనబడినవారము
మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2)         ||సహోదరులారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME