జీవము గల దేవుని సంఘం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము
మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా
ఆ సంఘమందున వసియించినా
ఎంతో ఎంతో ధన్యము – (2)        ||జీవము||

యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2)
పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువవు (2)        ||జీవము||

యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము
పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2)
ఏ నరుడు దేవుని నిలయమును
పాడు చేయకూడదు (2)        ||జీవము||

యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక
సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2)
ప్రభు యేసు దివ్య మాదిరిలో
గమ్యము చేరగా సాగుదాం (2)        ||జీవము||

ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం
శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2)
లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం
లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం        ||జీవము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు ఉంటే చాలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు ఉంటే చాలు
నా జీవితం ధన్యము (2)
ఆయనే నా సర్వము
ఆయనే నా కేడెము
అయనే నా స్వాస్థ్యము (2)               ||యేసు||

ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు
ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2)
ఆయనే నా మార్గము
ఆయనే నా సత్యము
ఆయనే నా జీవము (2)               ||యేసు||

ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు
లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు (2)
ఆయనే నా శైలము
ఆయనే నా ధైర్యము
ఆయనే నా విజయము (2)               ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆశ తీర నా యేసు స్వామిని

పాట రచయిత: ఎన్ జె సైమన్
Lyricist: N J Symon

Telugu Lyrics

ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము     ||ఆశ||

దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను          ||ఎంత||

లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
లోబడు వారిని పారమున చేర్చును         ||ఎంత||

English Lyrics

Audio

ధన్యము ఎంతో ధన్యము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)          ||ధన్యము||

ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు – మన్నించబడెనో (2)          ||వారె ధన్యులు||

క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2)          ||వారె ధన్యులు||

ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2)          ||వారె ధన్యులు||

ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2)
అపవాది తంత్రములు – గుర్తించు వారును (2)          ||వారె ధన్యులు||

శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2)
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2)          ||వారె ధన్యులు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME