నన్నెంతగా ప్రేమించితివో

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics


నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా – నే చెప్పగలనా
దాయనా – నే దాయగలనా (2)
అయ్యా… నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)

ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2)      ||గలనా||

ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2)      ||గలనా||

English Lyrics

Audio

ఎవరితో నీ జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)

దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

English Lyrics

Audio

HOME